రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
NRML: ఖానాపూర్ పట్టణంలోని జెడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. మంచిర్యాలలోని హావెన్ ఆఫ్ హోప్ హై స్కూల్‌లో జరిగిన SGF ఫుట్‌బాల్ పోటీలలో ఆ పాఠశాలకు చెందిన డి. దివ్య, ఇందు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని పాఠశాల హెచ్ఎం సంధ్యారాణి, పీఈటీ సుజాత అభినందించారు.