బాదం ఆకుపై ‘రామనామం’ లిఖించిన చిత్రకారుడు

బాదం ఆకుపై ‘రామనామం’ లిఖించిన చిత్రకారుడు

KMR: శ్రీరామనవమి పురస్కరించుకుని బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చిత్రకారుడు బాస బాల్ కిషన్ తన భక్తిని చాటుకున్నారు. ఒక బాదం ఆకుపై శ్రీరాముని చిత్రంతో పాటు, 12 భాషల్లో రామనామాన్ని లిఖించి అందరినీ అబ్బురపరిచారు. ఈ అద్భుత కళాఖండాన్ని చూసిన స్థానికులు బాల్ కిషన్‌ను అభినందనలతో ముంచెత్తారు. శ్రీరాముని కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.