ప్రభుత్వ భూమి ఆక్రమణపై హెచ్ఎండీఏకు ఫిర్యాదు
MBNR: బాలానగర్ మండలం శేరిగూడలో ఓ ప్రైవేటు వెంచర్ యజమాని ప్రభుత్వ భూమిని ఆక్రమించారని సామాజిక కార్యకర్త వెంకటయ్య హెచ్ఎండీఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్ల విలువైన ఒక ఎకరం స్థలాన్ని ఆక్రమించి వెంచర్ నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంచర్ అనుమతులు రద్దు చేసి, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.