ట్రోఫీలను అందుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే
ATP: విజయవాడలోని ఆంధ్రా లూక్స్ కన్వెన్షన్‌లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. పలు క్రీడల్లో ప్రతిభ చూపిన ఆమె సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ట్రోఫీలను అందుకున్నారు. పాలనాపరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇటువంటి వేదికలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.