కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంసూర్ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.