ప్రమాదాలు జరగకుండా ప్రజలే ఏర్పాట్లు

ప్రమాదాలు జరగకుండా ప్రజలే ఏర్పాట్లు

VZM: కొత్తవలస నుంచి విజయనగరం వెళ్లే రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారింది. క్రాంతి ట్రాన్సుపోర్టు వద్ద రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి . వీటిని నివారించడం కోసం ప్రజలే అక్కడ మొక్కలు పెట్టి రక్షణ కల్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై అధికారులు స్పందించి రహదారులు బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.