ఆర్మూర్ శివారులో చిరుత ఉందంటూ ప్రచారం

ఆర్మూర్ శివారులో చిరుత ఉందంటూ ప్రచారం

NZB: ఆర్మూర్ శివారులోని పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలో చిరుతపులి కనిపించిందంటూ పలువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణం సమీపంలోని మొత్తం ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత పులి ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఎవరూ ఒంటరిగా ప్రయాణించొద్దని, గుంపులుగా ప్రయాణించాలని కోరారు.