ఎక్సైజ్ అధికారుల దాడులు

ELR: చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో నిర్వహించే సారా శిబిరంపై గురువారం విస్తృత దాడులు నిర్వహించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. ఈ దాడులలో లావూరి కోదండ రామస్వామి, హశావత్ సాయికుమార్‌లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 5 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సారా కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవన్నారు.