ALERT: నేడు, రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని ప్రకటించారు.