కోటగిరిలో ఓటర్ జాబితాపై ఆల్ పార్టీ సమావేశం

కోటగిరిలో ఓటర్ జాబితాపై ఆల్ పార్టీ సమావేశం

NZB: కోటగిరి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితాపై పలు పార్టీల నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, ఇతర సమస్యలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.