'వరద బాధిత రైతులను ఆదుకోవాలి'

'వరద బాధిత రైతులను ఆదుకోవాలి'

KMR: భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర అపెక్స్ కమిటీ మెంబర్ మామిండ్ల అంజయ్య డిమాండ్ చేశారు. లింగంపేట మండలం లింగంపల్లి, కుర్దు తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు.