కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమలాపురంలో శాంతి ర్యాలీ

కోనసీమ: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అయితాబత్తుల సుభాషిణి ఆధ్వర్యంలో అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం కశ్మీర్‌లోని పహాల్గామ్‌లో ఉగ్రవాదుల దాడికి నిరసన తెలిపారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు. అనంతరం సుభాషిణి మాట్లాడుతూ.. భద్రత లేకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగిందన్నారు.