6 గ్యారంటీలు అమలు చేయాలని వినతి
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు, వృద్ధులకు పింఛన్లు, రైతులకు భరోసా, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.