విజయవాడలో జీతాలు రాక హోంగార్డులు అవస్థలు
ఎన్టీఆర్: విజయవాడలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల కుటుంబ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. జీతాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.