' ఆ కాలువతో పొంచి ఉన్న ప్రమాదం'
ASF: ఆసిఫాబాద్ మండలం మాణిక్ గూడలో కొమురం భీం ప్రాజెక్టు కుడి కాలువ కారణంగా ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మాట్లాడుతూ కాలువ లోతు ఎక్కువగా ఉండటం, పనులు అసంపూర్తిగా ఉండటంతో 15 ఏళ్లుగా మట్టి క్రమంగా కూలుతోంది .పాఠశాల, పంచాయతీ భవనం, ఇళ్లు ప్రమాదంలో పడ్డాయి. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.