ఎన్నికల ప్రశాంతతకు చర్యలు: ఎస్పీ
SRPT: మునగాల మండలం, కలకోవలో సోమవారం ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముందుగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి భరోసా కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... ఓటర్లు గొడవలకు పోకుండా, సోదర భావంతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తగాదాలకు పాల్పడేవారిపై బైండోవర్ ఉంటుందని హెచ్చరించారు.