VIDEO: గణితం పరీక్ష.. ఉట్నూర్ పకడ్బందీగా నిర్వహణ
ADB: ఉట్నూర్ మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 4 కేంద్రాల్లో విద్యార్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. గణితం పరీక్ష కావడంతో కొందరు విద్యార్థుల్లో ఆందోళన కనిపించినా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.