తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న భైరవి మాత
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా హరిద్వార్‌కు చెందిన శ్రీ భైరవి మాత అమ్మవారు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ ప్రహ్లాద్ రావు ఆమెకు స్వాగతం పలికి, ఆలయ విశిష్టతను వివరించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల తీరును పరిశీలించారు.