BRS పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మాజీ ఎమ్మెల్యే
BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వెల్లడించారు. భద్రాచలంలో బుధవారం ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడతలో భద్రాచలం మేజర్ జీపీలోని 20వార్డులలో విజయం సాధించాలన్నారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు.