పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

WGL: నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పనితీరుతో పాటు కేసుల వివరాలు, సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల నమ్మకాన్ని పొందాలన్నారు.