సూపర్ స్టార్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మహేష్ బాబు అభిమానులతో SMలో చిట్‌చాట్ చేసింది. ఈ క్రమంలో ఆమె తనకు మహేష్ బాబు ఏజ్ సీక్రెట్ తెలుసుకోవాలని ఉందని పేర్కొంది. కాగా, ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు.