'రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు'

TG: సీఎం రేవంత్‌రెడ్డి మాటలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపం పెట్టినట్లు ఉన్నాయని మాజీమంత్రి KTR అన్నారు. 'BRS పార్టీని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం. కానీ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతిసేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. రేవంత్.. అత్యంత అసమర్థ, దక్షత లేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైపోతారని KCR ఎప్పుడో చెప్పారు' అని పేర్కొన్నారు.