కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీలో గురువారం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా నూతన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే మట్టారాగమయి ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. పేదలందరికీ సొంతిల్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.