పెడకాకానిలో బాలికలకు అవగాహన కార్యక్రమం
GNTR: పెడకాకాని మండలంలోని వడ్డెర కాలనీలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీస్ నాగరాజా సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడాలని సూచించారు. బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని తెలిపారు. సిస్టర్ విద్య జీవన నైపుణ్యాల ప్రాముఖ్యత వివరించారు.