యువకుల వీరంగం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

యువకుల వీరంగం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: రాజంపేట మండలం ఊటుకూరులో ఐదుగురు యువకులు ఇవాళ కత్తులు, కట్టెలతో వీరంగం సృష్టించారు. ఈ దాడిలో లక్కాకుల బాబు, సాంబారు రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మరో ముగ్గురిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం యువకులు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుని పోలీసులను బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.