'చింతూరులో అమరవీరుల సభను జయప్రదం చేయాలి'

'చింతూరులో అమరవీరుల సభను జయప్రదం చేయాలి'

ASR: చింతూరు కేంద్రంగా డిసెంబర్‌ 21న నిర్వహించనున్న అమరవీరుల సభను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఎటపాక మండలం రాంగోపాలపురం గ్రామంలో నిర్వహించిన సీపీఎం ఎటపాక మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.