పేకాట రాయుడు అరెస్ట్
HNK: జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవ నగర్ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 11 మందిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 59,340 నగదు, 11 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.