జగన్ తీరు జుగుప్సాకరంగా ఉంది: వర్ల రామయ్య
AP: హైదరాబాద్‌లో జగన్ వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. 'జగన్ సృష్టించిన అలజడి సీబీఐ కోర్టును ప్రభావితం చేసేలా ఉంది. జగన్ తీరు ఇలాగే వదిలితే మిగతావారికీ సంప్రదాయంగా మారే ప్రమాదం ఉంది. జగన్ కోర్టుకు వస్తున్నట్లు లేదు.. అత్తారింటికి వచ్చినట్లు ఉంది. రప్పా.. రప్పా అని ప్లకార్డులు ప్రదర్శించడం దేనికి సంకేతం?' అని ప్రశ్నించారు.