VIDEO: శ్రీ ఏడుపాయలలో దుర్గమ్మ దివ్యదర్శనం
MDK: పాపన్నపేట మండలం నాగసానిపల్లి శివారులో వెలిసిన ఏడుపాయల దేవస్థానంలో వన దుర్గమ్మకు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం, చవితి తిథి పురస్కరించుకొని అమ్మవారికి భాను వాసరే, పంచామృతాలతో అభిషేక పూజలు నిర్వహించారు. నేడు సెలవు దినం కావడంతో ఈ తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.