VIDEO: బాపట్లలో వృథాగా పోతున్న మంచినీరు

బాపట్లలో GBC రోడ్డులో ఆదివారం పైపు లీకై మంచినీరు వృథాగా పోతుంది. పైపుకు ఉన్న హోల్ పెద్దదిగా ఉండటంతో నీరు అధిక శాతం బయటకు వస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మంచినీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.