VIDEO: ధాన్యం దిగుమతిలో మిల్లర్ల అలసత్వం..!
నల్గొండ జిల్లాలో ధాన్యం దిగుమతుల్లో రైస్ మిల్లర్ల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. అనేక మిల్లుల వద్ద పదుల సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. మిల్లర్లు ఒక లారీ ధాన్యం దిగుమతి చేసుకోవడానికి 3 నుంచి 4 రోజులు పడుతుందని, నానా కొర్రీలు పెడుతున్నారని లారీ డ్రైవర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. అధికారులు ఈ సమస్యపై ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం.