'జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి'
ASF: జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని TUWJ (IJU) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు.శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల మహా ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. అయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పోరాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు.