తడ్కల్‌లో 'అరైవ్ -అలైవ్' పై అవగాహన
SRD: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ అరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై దుర్గారెడ్డి అన్నారు. సోమవారం కంగ్టి మండల తడ్కల్ రైతు వేదికలో అరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహన దారుల రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు తెలిపారు. సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి ఉన్నారు.