పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తా: MLA
ADB: కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి జిల్లాలోని ఆయా పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని MLA పాయల్ శంకర్ అన్నారు. రెండో విడత ఎన్నికల్లో BJP బలపరిచిన 54 మంది గెలుపొందడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సంబరాలు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లను సన్మానించారు. పంచాయతీల అభివృద్ధికి, ప్రజల సమస్యలకై కృషి చేయాలని సూచించారు.