బాధిత కుటుంబానికి రూ.1.05లక్షల ఆర్థిక సాయం

SKLM: సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు కుమ్మరి రాము (34) ఇటీవల డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బోరుభద్ర గ్రామానికి చెందిన ఉద్యోగులు, యువకులు అతని కుటుంబాన్ని ఆదుకోడానికి రూ.1,05,000ల ఆర్థిక సాయం గురువారం అందజేశారు. స్థానిక వివేకానంద విద్యాలయం వాళ్ళు అతని కుమారునికి ఉచిత విద్య అందిస్తామన్నారు.