విశాఖ విమ్స్‌లో వైద్యుల నిరసన

విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో వైద్యులు సమ్మె బాట పట్టారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా చేరి 3 సంవత్సరాలు దాటిన వారికి జీతాలు పెంచాలని, కాంట్రక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోక పోవడంతో సమ్మె బాట పట్టామని వారు పేర్కొన్నారు.