మినీ లారీ బోల్తా 9 మందికి గాయాలు
ప్రకాశం: దోర్నాలలోని శ్రీశైలం వెళ్లే రహదారిలో అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద మూల మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం తెలుస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి గాయపడ్డ వారిని సమీప వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.