ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి
కరీంనగర్: జిల్లాలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం జాతీయ సేవా పథకం (NSS) యూనిట్-3 ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ డి. హరికాంత్ మాట్లాడుతూ.. స్త్రీల విద్య, సమానత్వం, హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు.