'కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి మేలు జరుగుతుంది'
SRCL: తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో SDF నిధులతో మంజూరైన బోర్ మోటార్‌ను కాంగ్రెస్ నాయకులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తయ్య, అజయ్, ప్రశాంత్ ఉన్నారు.