ప్రధాన రోడ్డుపై కూలిన భారీ వృక్షం

ప్రధాన రోడ్డుపై కూలిన భారీ వృక్షం

KMM: బోనకల్లు మండలం వైరా- జగ్గయ్యపేట ప్రధాన రోడ్డు మార్గంలోని రావినూతల– జానకిపురం గ్రామాల మధ్య శనివారం భారీ మ‌ర్రి చెట్టు రోడ్డుపై కూలింది. చెట్టు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. భారీ వృక్షం రోడ్డుపై పడే సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.