జగన్‌కు రాఖీ కట్టిన మాజీ ఎమ్మెల్యే

జగన్‌కు రాఖీ కట్టిన మాజీ ఎమ్మెల్యే

KRNL: మాజీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ అమర్నాథ్ రెడ్డి రిసెప్షన్ బుధవారం డోన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. వేడుక అనంతరం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అధినేతకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు.