రైలు ప్రయాణికులకు శుభవార్త

రైలు ప్రయాణికులకు శుభవార్త

NTR: విజయవాడ మీదుగా భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02811 BBS-YPR రైలును మే 24 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR-BBS మధ్య నడిచే రైలును మే 26 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఓ ప్రకటన విడుదల చేశారు.