కరెంట్ లైన్ తొలగించడానికి రూ. 48,558 బిల్లు

MHBD: జిల్లా కేసముద్రం మండలం తౌర్య తండాకు చెందిన మలోత్ కోమిలి అనే మహిళ తన ఇంటిపై నుంచి వెళ్తున్న 11 కేవీ కరెంట్ లైన్‌ను తొలగించాలని కోరుతోంది. ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు మంజూరైనప్పటికీ, కరెంటు లైన్ అడ్డుగా ఉండటంతో నిర్మాణం చేపట్టలేకపోతోంది. లైన్‌ను పది అడుగులు జరపడానికి రూ. 48,558 బిల్లు వచ్చిందని, ఇది తమకు భారంగా మారిందని ఆమె వాపోతోంది.