పట్టపగలే చోరీ.. రూ.7కోట్లతో పరారీ

పట్టపగలే చోరీ.. రూ.7కోట్లతో పరారీ

పట్టపగలే నడిరోడ్డుపై భారీ దొంగతనం జరిగిన ఘటన బెంగళూరులో జరిగింది. పన్ను అధికారులమంటూ వచ్చిన దుండగులు రూ.7 కోట్లను కాజేశారు. ATMలో పెట్టేందుకు క్యాష్‌ను తరలిస్తున్న వ్యాన్‌ను పన్ను అధికారులమని, పత్రాలు చూపించాలని హడావుడి చేశారు. పత్రాలు చూపించేలోపే.. డబ్బును కారులోకి ఎక్కించి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.