విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

SKLM: ప్రియాగ్రహారం పంచాయతీ మూలపేటకు చెందిన ఐటీఐ చదివిన నేతింటి ప్రసాదరావు (23) అనే యువకుడు గురువారం గ్రామంలో విద్యుత్ తీగ అమర్చుతుండగా షాక్‌తో మృతి చెందాడు. తండ్రి లోకనాథం వెంటనే నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు.