దరఖాస్తులపై ఆరా తీసిన సబ్ కలెక్టర్
PPM: ఇంటి స్థలాలు కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులను సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వాస్తవాలను తెలుసుకునే దిశలో భాగంగా శుక్రవారం పార్వతీపురం మండలంలోని గోపాలపురం, అడ్డాపుశిల, పిన్నింటి రామినాయుడువలస గ్రామాలను పర్యటించారు. దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.