ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
అన్నమయ్య: మదనపల్లె పట్టణం లోని పలు ప్రాంతాలలో ఇవాళ డీఎస్పీ. ఎస్, మహేంద్ర ఆధ్వర్యంలో కార్డ్ అండ్ సెర్చ్‌ను నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేని, అనుమానాస్పదంగా ఉన్న 61 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీ.ఎస్.పీ మాట్లాడుతూ.. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.