నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
CTR: కొమరోలు మండలంలో RDSS పనులు చేస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మల్లారెడ్డి పల్లె, రెడ్డిచెర్ల, మూలపల్లె, మిట్టమీది పల్లె, మదవపల్లె గ్రామాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు.