మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

JN: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే ప్రభుత్వం ఈ సంబరాలు నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.