నీటి సరఫరాలో అంతరాయం కలగొద్దు: మేయర్

నీటి సరఫరాలో అంతరాయం కలగొద్దు: మేయర్

KNR: జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎస్.ఆర్.ఆర్ రిజర్వాయర్‌ను సందర్శించి, నీటి నిల్వలు, పంపింగ్ విధానాన్ని పరిశీలించారు. విలీన గ్రామాలకు సైతం సమయపాలన పాటిస్తూ తగినంత నీరు అందించాలన్నారు. లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు.